Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.1.37

Āndhra Mahābhāratamu 1.1.37

Language
Telugu

1.1.37

వ. మఱియు ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలసభాశ్రవణంబును, రాజసూయమహాధ్వరారంభంబును, జరాసంధవధయును, గిరివ్రజనిరుద్ధు లైన రాజులఁ గృష్ణుఁడు విడిపించుటయును, దిగ్విజయంబును, రాజసూయంబు, నర్ఘ్యాభిహరణంబును, శిశుపాలవధయును, రాజసూయవిభూతికి దుఃఖితుం డై సభాస్ఖలితుం డై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయును, దత్కారణంబున జూదం బాడుటయు, నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును, ద్యూతదుఃఖార్ణవమగ్ను లైన పాండవులం బాంచాలి యుద్ధరించుటయును, బునర్ద్యూతపరాజితు లై పాండవులు వనవాసగతు లగుటయు నను వృత్తాంతంబుల నొప్పి నాలుగువేలున్‌ మున్నూటపదునొకండు శ్లోకంబులు గలిగి.