Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.132

Āndhra Mahābhāratamu 1.3.132

Language
Telugu

1.3.132

వ. అనిన నా కచునకు దేవయాని కరం బలిగి ‘నీవు నా మనోరథంబు విఫలంబుగాఁ జేసిన వాఁడవు; నీకు సంజీవని పని సేయకుండెడు’ మని శాపం బిచ్చినఁ, గచుం ‘డేను ధర్మపథంబుఁ దప్పనివాఁడను; నీ వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యెనేనియు నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక; మఱి నీవు ధర్మ విరోధంబు దలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు’ మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్‌క్షణంబ.