Andhra Mahabharatamu 1.3.201
Āndhra Mahābhāratamu 1.3.201
- Language
- Telugu
1.3.201
వ. ‘నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు; శుక్రవచనంబును నిట్టిద’ యని యయాతి ప్రకృతిజనంబుల నొడంబఱిచి, పూరు నఖిల భూభారధురంధరుం జేసి, యదుప్రభృతులఁ బ్రత్యంత భూములకు రాజులం జేసి, తాను వేదవేదాంగపారగు లయిన బ్రాహ్మణులతోడం దపోవనంబునకుం జని, యందుఁ గందమూల ఫలాశనుం డై వన్యంబులయిన ఫలంబుల హవ్యకవ్యంబుల నగ్నిభట్టారకుం బితృదేవతలం దనుపుచు, వానప్రస్థ విధానంబుఁ దప్పక శిలోంఛవృత్తి నతిథిభుక్తశేషం బుపయోగించుచు, నియతాత్ముం డై జితారిషడ్వర్గుండును నయి సహస్ర వర్షంబులు దపంబు సలిపి సర్వసంగ విముక్తుం డై, సర్వద్వంద్వంబులును విడిచి ముప్పది యేండ్లు నిరాహారుం డయి, యొక్కయేఁడు వాయుభక్షకుం డయి, పంచాగ్నిమధ్యంబున నిల్చి, యొక్కయేఁడు నీటిలో నేకపాదంబున నిలిచి, మహాఘోరతపంబు సేసి, దివ్య విమానంబున దేవలోకంబునకుం జని, యందు దేవర్షిగణపూజితుం డై బ్రహ్మలోకంబునకుం జని, యందు బ్రహ్మర్షిగణపూజితుం డై యనేక కల్పంబు లుండి, క్రమ్మఱ నింద్రలోకంబునకు వచ్చిన నింద్రుండు వానిం బూజించి యి ట్లనియె.