Andhra Mahabharatamu 1.3.211
Āndhra Mahābhāratamu 1.3.211
- Language
- Telugu
1.3.211
వ. అని తపోభిమానంబున మహర్షులతపంబు లవమానించి పలికిన నయ్యయాతిగర్వంబునకు సహింపక యింద్రుం డలిగి ‘నీకు దేవలోకసుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తియయ్యె; నీగర్వంబు నిన్నింత సేసె; నింక నధోలోకంబున కరుగు’ మనిన వాఁడును ‘మనుష్యలోకంబునకుం బోవనోప; నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండు నట్లుగా నాకుఁ బ్రసాదింపు’ మని యింద్రుననుమతంబు వడసి.