Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.213

Āndhra Mahābhāratamu 1.3.213

Language
Telugu

1.3.213

వ. అంతనయ్యయాతి దౌహిత్రు లయిన యష్టకుండును బ్రతర్దనుండును వసుమంతుండును నౌశీనరుం డయిన శిబియు ననువారలు సద్భువన నివాసులు దమ యొద్దకుం జనుదెంచిన యయాతి నధిక తేజోమయు ననంత పుణ్యమూర్తిం గని నిసర్గస్నేహంబున నభ్యాగత పూజల సంతుష్టుంజేసి ‘నీవెవ్వండ? వెం దుండి యేమికారణం బున నిందులకు వచ్చి?’ తని యడిగిన వారలకు నయ్యయాతి యి ట్లనియె.