Andhra Mahabharatamu 1.3.218
Āndhra Mahābhāratamu 1.3.218
- Language
- Telugu
1.3.218
వ. ‘ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండ నయి తదాదేశంబున సద్భువనంబునకు వచ్చితి’ ననిన నాతండు దమకు మాతామహుం డగుటయు నతని మహత్త్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞానసంపత్తియు నెఱింగి, యష్టకాదులు సకల ధర్మాధర్మంబులు, సుగతి, దుర్గతి స్వరూపంబులు, జీవుల గర్భోత్పత్తిప్రకారంబులు, వర్ణాశ్రమధర్మంబులు నడిగిన వారల కయ్యయాతి యి ట్లనియె.