Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.225

Āndhra Mahābhāratamu 1.3.225

Language
Telugu

1.3.225

వ. ‘మీకుంబుణ్యలోకంబులుగల’ వని యయాతి సెప్పిన విని యన్నలువురు సంతోషించి ‘యేము నీ దౌహిత్రులము సు’ మ్మని త మ్మెఱింగించి వానికిఁ బుణ్యలోకంబు లిచ్చిన న ట్లయ్యయాతి సత్సంగతిం జేసి తానును దౌహిత్రులు నూర్ధ్వలోకంబునకుం జనియె నని.