Andhra Mahabharatamu 1.4.225
Āndhra Mahābhāratamu 1.4.225
- Language
- Telugu
1.4.225
వ. ‘పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీశుల్కార్థంబుగా సర్వజనసమక్షంబున నాచేసిన సమయస్థితి విడువ; నది యట్లుండె; మీయానతిచ్చినట్లు నాయెఱుఁగని ధర్మువులు లేవు; శంతనుసంతానంబు శాశ్వతంబగునట్లుగ క్షత్త్రధర్మంబుసెప్పెద; నాచెప్పినదాని ధర్మార్థవిదు లయి లోకయాత్రానిపుణు లయిన పురోహితప్రముఖ నిఖిలబ్రాహ్మణవరులతో విచారించి చేయునది’ యని భీష్ముఁ డందఱు విన ని ట్లనియె.