Andhra Mahabharatamu 1.4.227
Āndhra Mahābhāratamu 1.4.227
- Language
- Telugu
1.4.227
వ. మఱి యదియునుంగాక యుతథ్యుం డను మునివరుపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవరన్యాయంబున నభిలషించినఁ దదీయగర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి ‘సర్వభూతేప్సితం బైన యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందు’ మని శాపం బిచ్చిన, వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకలవేదవేదాంగవిదుండయి జాత్యంధుం డయ్యును తనవిద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యను నొక్కబ్రాహ్మణి వివాహం బయి గౌతమాదు లయిన కొడుకులం బెక్కండ్రం బడసిన, నది లబ్ధపుత్త్రయై తన్ను మెచ్చుకున్న ‘నిట్లేల నన్ను మెచ్చ?’ వని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యి ట్లనియె.