Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.231

Āndhra Mahābhāratamu 1.4.231

Language
Telugu

1.4.231

వ. అనిశాపంబిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి ‘యిమ్ముదుకని నెటయేనియుం గొనిపొం’ డని తనకొడుకులం బంచిన, వారును నయ్యౌతథ్యు నతివృద్ధు జాత్యంధు నింధనంబులతో బంధించి మోహాంధులయి గంగలో విడిచిన, నమ్మునియునుబ్రవాహవేగంబునఁబెక్కుదేశంబులుగడచి చనియె; నంత నొక్కనాఁడు బలియనురాజు గంగాభిషేకార్థంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్త స్వరిత ప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ, దరంగ ఘట్టనంబునం దనయున్నదరిం జేరవచ్చినవానిఁ దీరంబుఁ జేర్చి, యింధనబంధనంబులు విడిచి, మహర్షి మామతేయుంగా నెఱిఁగి, తన్నెఱింగించుకొని నమస్కారంబు సేసి యి ట్లనియె.