Andhra Mahabharatamu 1.4.237
Āndhra Mahābhāratamu 1.4.237
- Language
- Telugu
1.4.237
వ. అనిన నబ్బలి సంతానార్థి గావున వెండియు నమ్మునిం బ్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘతముండును దానియంగంబులెల్ల నంటిచూచి ‘వంశకరుండును మహాసత్త్వుండును నయ్యెడు కొడుకు నీకుం బుట్టు’ నని యనుగ్రహించిన, దానికి నంగరాజను రాజర్షి పుట్టె; నివ్విధంబున నుత్తమ క్షత్త్రియక్షేత్త్రంబులందు ధర్మమార్గంబున బ్రాహ్మణులవలనం బుట్టివంశకరు లయిన క్షత్త్రియు లనేకులు గలరు.