Andhra Mahabharatamu 1.4.252
Āndhra Mahābhāratamu 1.4.252
- Language
- Telugu
1.4.252
వ. అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబికకడకుం జని ‘క్షేత్రజుం డైనవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యధురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు; మెల్లధర్మంబులకంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు; నేఁటిరాత్రి నీకడకు దేవరుండు వచ్చుం; దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది’ యని కోడలి నొడంబఱిచి యనేకసహస్రమహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపియున్న నారాత్రియందు.