Andhra Mahabharatamu 1.4.255
Āndhra Mahābhāratamu 1.4.255
- Language
- Telugu
1.4.255
వ. కృష్ణద్వైపాయనుండును దానికింబుత్త్రదానంబు సేసి ‘యాయంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టు; వాఁడు మాతృదోషంబున నంధుం డగు’ ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుంబ్రార్థించి’ యింకనంబాలికయం దొక్కకొడుకుంబడయు’ మని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన, నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనైయున్న నక్కోమలికిం బుత్త్రదానంబుసేసి’ యీయంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగుపుత్త్రుండు పుట్టు; వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగు’ నని చెప్పి యరిగిన.