Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.258

Āndhra Mahābhāratamu 1.4.258

Language
Telugu

1.4.258

వ. ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకర్మాదిక్రియ లొనరించినంత. నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు, నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న ‘నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె; నింక నొక్కకొడుకు రూపవంతుం బడయు’ మనిన, ‘నియతతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టు’ననవుడు, సత్యవతి తొల్లింటియట్ల కోడలి నియోగించిన, నక్కోమలి యమ్మునివరు వికృతవేషరూప గంధంబుల కోపక రోసి, తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన, వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుండై దానికిం బుత్త్రదానంబు సేసిన.