Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.262

Āndhra Mahābhāratamu 1.4.262

Language
Telugu

1.4.262

వ. అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె; మాండవ్యుం డను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున నెడ గలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమాను లై మాండవ్యుసమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాఁగిన, వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునిం గని ‘రాజధనాపహారు లయిన చోరులు నీయొద్దన పాఱిరెటవోయి రెఱుంగుదేని చెప్పు’ మనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి యయ్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నామ్రుచ్చులం బట్టికొని.