Andhra Mahabharatamu 1.4.268
Āndhra Mahābhāratamu 1.4.268
- Language
- Telugu
1.4.268
వ. అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన, రాజునుం బఱతెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి ‘నా చేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింపవలయు’ నని శూలంబువలన నమ్మునింబాచుచోనది పుచ్చరాకున్న, దానిమొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె; దానం జేసి యాముని యాణిమాండవ్యుండునాఁబరఁగుచునమ్మహాముని ఘోరతపంబుసేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యమునిపురంబునకుం జని ధర్మరాజున కి ట్లనియె.