Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.272

Āndhra Mahābhāratamu 1.4.272

Language
Telugu

1.4.272

వ. అనిన విని మాండవ్యుం డలిగి ‘జన్మంబు మొదలుగాఁబదునాలుగువత్సరంబులు దాఁటునంతకుఁబురుషుండు బాలుండు; వాఁడెద్ది సేసినఁ బాపంబుం బెద్ద పొరయండు; వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు; రిది నాచేసిన మర్యాద; నీవిట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుఁజేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబు గావించినవాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టు‘మని శాపం బిచ్చుటంజేసి వాఁడు విదురుం డై పుట్టె.