Andhra Mahabharatamu 1.5.206
Āndhra Mahābhāratamu 1.5.206
- Language
- Telugu
1.5.206
వ. ‘మఱి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధములు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీయట్టిపేదపాఱువారలతోఁ గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేర’ దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుం డవమానజనితమన్యుఘూర్ణమానమానసుం డయి యెద్దియుం జేయునది నేరక పుత్త్రకళత్రాగ్నిహోత్రశిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె; నంత నప్పురబహిరంగణంబున ధృతరాష్ట్రపాండునందను లందఱుఁ గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన.