Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.211

Āndhra Mahābhāratamu 1.5.211

Language
Telugu

1.5.211

వ. ‘దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ; డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని ద్రోణుం డొక్కబాణం బభి మంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దానిపుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారు లెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెఱింగించిన నాతండును.