Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.214

Āndhra Mahābhāratamu 1.5.214

Language
Telugu

1.5.214

వ. ఏను ద్రోణుం డనువాఁడ; భరద్వాజపుత్త్రుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయ నంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాఁడు, పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డను వాఁడు నా కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి, ‘యేను పాంచాలవిషయంబునకు రా జయిననాఁడు నా యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ’ వని నన్నుఁ బ్రార్థించి చని, పృషతుపరోక్షంబునఁ దద్దేశంబునకు రా జయి యున్న, నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజస్వి నాత్మజుం బడసి, ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు.