Andhra Mahabharatamu 1.5.225
Āndhra Mahābhāratamu 1.5.225
- Language
- Telugu
1.5.225
వ. ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న, నానాదేశంబులం గల రాజపుత్త్రులెల్ల వచ్చి వారితోడఁ గలసి కఱచుచుండిరి; మఱియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె; నంత.