Andhra Mahabharatamu 1.5.234
Āndhra Mahābhāratamu 1.5.234
- Language
- Telugu
1.5.234
వ. ఇ ట్లరిగి వనంబులోఁ గ్రమ్మరుచున్న నం దొక్క భటునికుక్క తోడు దప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యుసమీపంబున మొఱింగిన, నయ్యెలుంగు విని దానిముఖంబునం దేడుబాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁ డేసిన, నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ.