Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.241

Āndhra Mahābhāratamu 1.5.241

Language
Telugu

1.5.241

వ. అనిన విని ద్రోణుం డదరిపడి ‘వానిం జూతము ర’మ్మని యర్జునుం దోడ్కొని, యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేఁగిన, నెఱింగి వాఁడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి, ‘యేను మీ శిష్యుండ; మి మ్మారాధించి మీ ప్రసాదంబున నివ్విలువిద్యఁ గఱచితి’ నని కరంబులు మొగిచియున్నం జూచి, ద్రోణుం ‘డట్లేని మాకు గురుదక్షిణ యి’మ్మనిన సంతసిల్లి వాఁ డిట్లనియె.