Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.248

Āndhra Mahābhāratamu 1.5.248

Language
Telugu

1.5.248

వ. అ క్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువుల బాణంబులు సంధించి నా పంచిన యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొక ళ్లొకళ్ళన పంచెద’ నని ముందఱ ధర్మనందనుం బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె.