Andhra Mahabharatamu 1.5.251
Āndhra Mahābhāratamu 1.5.251
- Language
- Telugu
1.5.251
వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నందఱ నిందించి, పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె.