Andhra Mahabharatamu 1.5.59
Āndhra Mahābhāratamu 1.5.59
- Language
- Telugu
1.5.59
వ. కామవ్యామోహితుం డయి కొండుకనాఁడు మదీయజనకుండు పరలోకగతుం డైనఁ దత్‌క్షేత్రంబున ధర్మమయుం డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్భవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్వ్యసనంబు కర్మవశంబున సంభవించె; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు సమచిత్తుండనై, హింస దలంపక నిత్యంబు నొక్కొక్కవనస్పతియందు నొక్కొక్కవన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం బయిననాఁ డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పాంసుపరిచ్ఛన్నదేహుండ నయి.