Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.137

Āndhra Mahābhāratamu 1.6.137

Language
Telugu

1.6.137

వ. ‘పశుపతి నివాసం బయిన యప్పుణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్యగోహిరణ్యాదిమహాదానంబుల బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందుఁ గొండొకకాలం బుండి వచ్చునది’ యని పంచిన వల్లె యని పాండవులు గాంధారీధృతరాష్ట్రులకు మ్రొక్కి వీడ్కొని, దుర్యోధనాదుల నందఱం బ్రియపూర్వకంబుగా సంభావించి, భీష్మద్రోణవిదురకృపాదులకు మ్రొక్కి యనేకవృద్ధబ్రాహ్మణులకు నమస్కారంబు సేసి వారలవలన దీర్ఘాయురారోగ్య స్వస్తివచనంబులతోఁ బునర్దర్శనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖు లయినంత.