Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.219

Āndhra Mahābhāratamu 1.6.219

Language
Telugu

1.6.219

వ. అట్టి చిత్ర వధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందఱు హిడింబానుగమ్యమాను లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక ‘రాక్షసులు వైరంబుఁ దలంచి మాయలు సేయుదురు కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న వోయిన తెరువున పొ’ మ్మనిన నది భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్ద్రచిత్తుం డయి ధర్మరాజు భీమున కి ట్లనియె.