Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.222

Āndhra Mahābhāratamu 1.6.222

Language
Telugu

1.6.222

వ. ‘దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు’ ననిన హిడింబ ధర్మరాజునకుం గుంతీదేవికి మ్రొక్కి యేకాంతంబునఁ గుంతి కి ట్లనియె; ‘నవ్వా! సర్వప్రాణులకు సామాన్యం బయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినాఁ డిప్పుడ ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ మి మ్మందఱ నెత్తికొని మీమెచ్చినచోటికిఁ బోవనేర్తు; నాపలుకులు నమ్ము నది; యే నతీతానాగతవర్తమానంబు లెల్లను దెల్లంబుగా నెఱుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు; ముందట నొక్క సరోవరంబును నొక్కవనస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నాఁకలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్న మీ కడకుఁ గృష్ణద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు సేయు నని చెప్పిన.