Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.227

Āndhra Mahābhāratamu 1.6.227

Language
Telugu

1.6.227

వ. అని భీమసేను నొడంబఱచి హిడింబ కనురాగంబుగాఁ జెప్పి ‘నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము; పగ ళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది’ యని నియమించిన భీముండును ‘బుత్త్రజన్మం బగునంతకు దీని మీవచనంబునఁ బరిగ్రహించెద’ నని వారల సమక్షంబున సమయంబు సేసె; నంతఁ బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనఁ గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి; శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసు లై సుఖం బున్నంత.