Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.236

Āndhra Mahābhāratamu 1.6.236

Language
Telugu

1.6.236

వ. ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకుఁ గుంతీదేవికి మ్రొక్కిన, నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్నిదినంబు లుండి; యొక్కనాఁ డంజలి పుటఘటితమస్తకుం డయి ‘రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం; బని గలయప్పుడు నన్నుఁ దలఁచునది; యాక్షణంబ వత్తు’ నని యందఱిచేత ననుజ్ఞాతుండై తల్లిం దోడ్కొని, యుత్తరాభిముఖుం డయి యరిగె; నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్స్య త్రిగర్తకీచక విషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని.