Andhra Mahabharatamu 1.6.259
Āndhra Mahābhāratamu 1.6.259
- Language
- Telugu
1.6.259
వ. ‘కావున నేను భవద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని క్కుమారుల రక్షింపనేర; నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసదృశులు గానివా రిక్కన్యం బ్రార్థించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్పరోక్షంబునం బునర్దార పరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది | యనుచు మరణవ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె.