Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.272

Āndhra Mahābhāratamu 1.6.272

Language
Telugu

1.6.272

వ. ‘పెద్దకాలంబునకు నీ యిలువరుస నేఁడు మాకు వచ్చె; ని చ్చిఱుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప; నేన పోయెద’ నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యి ట్లనియె; ‘నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద దలఁగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వాఁడును గడుబాలుండు; బలిగొనపోవ నర్హుండు గాఁడు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొని పోయెడు’ ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె.