Andhra Mahabharatamu 1.6.278
Āndhra Mahābhāratamu 1.6.278
- Language
- Telugu
1.6.278
వ. ‘ఈతనిచేతఁ దొల్లియుఁ బెక్కం డ్రసురులు నిహతు లయిరి’ వీఁడు మహాబలసంపన్నుండు మంత్రసిద్ధుం; డని భీముం బిలిచి ‘యీ బ్రాహ్మణునాపదం దలఁగి నాకు మనఃప్రియంబు సేయు’ మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంప బూనె; బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె; నంత ధర్మార్జుననకుల సహదేవులు వచ్చి పరమహర్ష పరిపూర్ణుండై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్మితు లగుచుండ ధర్మతనయుం డల్లనఁ దల్లికి ని ట్లనియె.