Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.280

Āndhra Mahābhāratamu 1.6.280

Language
Telugu

1.6.280

వ. అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి ‘యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయుఁ దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు, దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగాఁ దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి ‘యిది యేమి సాహసంబు సేసితి? రొడ్లకొడుకులకుంగాఁ దమకొడుకుల విడుచు దుర్బుద్ధులునుం గలరె; యిది లోకాచారవిరుద్ధంబు; మఱి భీమసేనుఁడు మీకు విడువందగియెడు కొడుకే’?