Andhra Mahabharatamu 1.6.285
Āndhra Mahābhāratamu 1.6.285
- Language
- Telugu
1.6.285
వ. అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్థుండు; రక్కసు నశ్రమంబునం జంపి యిందుల బ్రాహ్మణులబాధ యుడుచుం; బవనతనయు నుద్దేశించి సంతాపింపవలవదు; మనకు సుఖనివాసంబు సేసి పరమోపకారి యైన యీబ్రాహ్మణునకుఁ బ్రత్యుపకారంబు సేయ సమకూరె.