Andhra Mahabharatamu 1.6.292
Āndhra Mahābhāratamu 1.6.292
- Language
- Telugu
1.6.292
వ. ఇట్లు భీమసేనుం డిష్టాన్నోపభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుం డయి బకాసురుం డున్నచోటికిం జని యార్ద్రశుష్కకళేబరదుర్గంధనిందితం బయిన బకస్థానంబు డాయక యెడగలిగి యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని కాళ్లుసేతులుఁ గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె; నటబకాసురుండును.