Andhra Mahabharatamu 1.8.134
Āndhra Mahābhāratamu 1.8.134
- Language
- Telugu
1.8.134
వ. అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ‘ ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును, భవత్తీర్థాగమననిమిత్తంబును వ్రతంబును నెఱుంగనిదానఁ గాను; సర్వతీర్థసేవనంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరథంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా’ దనిన నర్జునుండు దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్భంబున నిరావంతుం డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్‌వృత్తాంతం బంతయుఁ దనసహాయు లయిన విప్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు.