Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.243

Āndhra Mahābhāratamu 1.8.243

Language
Telugu

1.8.243

వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి శ్వేతకి యనురాజర్షి ఘృతసంపూర్ణదక్షిణానేకాధ్వరుం డయి శతవార్షికసత్త్రయాగంబు సేయ సమకట్టి ఋత్విజులం బ్రార్థించిన, ఋత్విజులు ‘నేము నిరంతర క్లేశంబున కోపము; నీ వనవరతయజనశీలుండవు; నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని, యొరు లోప’ రని విసివి పలికిన, నాతండును గైలాసంబున కరిగి, కైలాసవాసు నిఖిలలోకవంద్యు నిందుశేఖరు నీశ్వరు నుద్దేశించి యుగ్రతపంబు సేసినఁ బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె.