Andhra Mahabharatamu 1.8.245
Āndhra Mahābhāratamu 1.8.245
- Language
- Telugu
1.8.245
వ. ‘దేవా! నీప్రసాదంబున శతవార్షికసత్త్రయాగంబు చేసెద; నాకు నీవు ఋత్విజుండవు గావలయు’ నని ప్రార్థించినం గరుణించి’ యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటంజేసి దాని నొరులకుఁ జేయంగాదు గావున, నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బండ్రెండేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశనుఁ దృప్తుం జేయు’ మనిన వాఁడును బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుండై యీశ్వరుండు వానిపాలికి వచ్చి యప్పుడ దుర్వాసు రావించి.