Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.247

Āndhra Mahābhāratamu 1.8.247

Language
Telugu

1.8.247

వ. శ్వేతకియుఁ దనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె; న ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు నైన; బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పినఁ బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున నయిన మహావ్యాధిఁగా నెఱింగి యగ్నిదేవున కి ట్లనియె.