Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.250

Āndhra Mahābhāratamu 1.8.250

Language
Telugu

1.8.250

వ. ‘ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి, తద్రక్షకులు గావించువిఘాతంబులు వారింపనేరక యేడుమాఱులు విఫలప్రయత్నుండ నైతి; నింక నెద్ది యుపాయంబు? నాకు నెవ్విధంబున ఖాండవభక్షణంబు దొరకొను? నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి, భావికార్యం బప్పుడు దలంచియుఁ; ‘గొంతకాలంబునకు నరనారాయణు లను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవసమీపంబున విహరింతురు; వారు భవత్ప్రార్థితు లై తమ యస్త్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు’ రనిన, నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి, కమలజువచనం బవలంబంబుగాఁ బెద్దకాలం బుండి, తద్వనమార్గంబున నప్పుడు కృష్ణార్జునులం గని ఖాండవదహనార్థంబు ప్రార్థించిన నగ్నిదేవున కర్జునుం డి ట్లనియె.