Andhra Mahabharatamu 1.8.252
Āndhra Mahābhāratamu 1.8.252
- Language
- Telugu
1.8.252
వ. అనిన నగ్నిదేవుండును నప్పుడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని, ‘తొల్లి నీకు సోముం డిచ్చిన బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూణీరయుగళంబును, గంధర్వజహయంబులం బూన్చిన రథంబు నియ్యతిరథుం డయిన యర్జునున కిమ్ము; మఱి చక్రంబును గదయును వాసుదేవున కి’ మ్మని పంచిన.