Andhra Mahabharatamu 1.8.254
Āndhra Mahābhāratamu 1.8.254
- Language
- Telugu
1.8.254
వ. మఱియుఁ బ్రతిపక్ష సంక్షయకరంబులయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును, వివిధాయుధభరితం బై, సింహలాంగూలకపిధ్వజవిరాజమానంబై, మహాంబుధరధ్వానబంధురంబై, మనోవాయువేగసితవాహవాహ్యమానం బై, రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతం బై, సకలదిగ్విజయాధిష్ఠానంబై యొప్పుచున్న దివ్యరథంబు నర్జునున కిచ్చి, సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదానవయక్షరాక్షసపిశాచోరగప్రశమనంబయి వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును, గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె; నట్లు సంప్రాప్తదివ్య చాపరథాయుధు లయి యున్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె.