Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.300

Āndhra Mahābhāratamu 1.8.300

Language
Telugu

1.8.300

వ. అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకుఁ దిరిగివచ్చి ‘నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్త్రుల నెవ్విధంబునం బడయనగునో’ యని చింతించి, పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్ద యగుటం జూచి, తానును శార్ఙ్గకుండై, జరిత యను లావుక పెంటియందు రమియించి, దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్ర ద్రోణు లనువారల నలువురఁ గొడుకులఁ బరమబ్రహ్మవిదులం బడసి, వారల ఖాండవవనంబునం బెట్టి, తనపూర్వభార్యయైన లపితయుం దానును విహరించుచు నొక్కనాఁడు ఖాండవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని, యగ్నిసూక్తంబుల స్తుతియించి యి ట్లనియె.