Andhra Mahabharatamu 1.8.311
Āndhra Mahābhāratamu 1.8.311
- Language
- Telugu
1.8.311
వ. ‘కావున నీవు మెచ్చినచోటికిఁ బోవనోపము; మావలని మోహంబు విడిచి యరుగు; మేము దహనక్లేశంబునం బొందినను నీవు జీవించి పుత్త్రులం బడయనోపుదువు; నీపుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు’ వని కొడుకు లెల్ల మ్రొక్కినం జూచి, జరితయు బాష్పపూరితనయన యై యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి, ప్రాణభయంబున గగనంబున కెగసి చనె నంత.