Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.318

Āndhra Mahābhāratamu 1.8.318

Language
Telugu

1.8.318

వ. ‘ఆలికి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి; తది పులుఁ గెటయేనియుం బఱచుం గా కేమి యయ్యెడు; వగవకుండు’ మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు ‘వసిష్ఠు నట్టి పురుషు నైన నరుంధతియట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీవిషయంబునందు సంశయింపకుండ’ దిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని, ఖాండవంబునకు వచ్చి పుత్త్రసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుండై నిజేచ్ఛ నరిగె; నగ్నిదేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుండయి కృష్ణార్జునుల దీవించి చనియె; నంత.