Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.321

Āndhra Mahābhāratamu 1.8.321

Language
Telugu

1.8.321

వ. ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చి, ‘వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు’ మని కృష్ణుం బ్రార్థించి, దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగె; నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని.