Andhra Mahabharatamu 2.2.283
Āndhra Mahābhāratamu 2.2.283
- Language
- Telugu
2.2.283
వ. మఱియుఁ గృష్ణద్వైపాయనుచేత శిక్షితులరు, నారదుచేత రక్షితులరు, మీకుం బురోహితుండు ధౌమ్యుండు, దైవమానుషసంపన్నులరు, బలపరాక్రమంబులంజేసి రాజులను, ధర్మచరితంబునం జేసి ఋషులను, మహత్త్వంబునంజేసి కుబేరవాసవాదులను జయించిన వారలరు, మిమ్ము భూమియు గాడ్పును జంద్రాదిత్యులు నెల్లకాలము రక్షించుచు నుండెడు; మెల్ల కార్యంబులయందును నప్రమత్తుల రయి వర్తిల్లునది; భవత్పునర్దర్శన మయ్యెడు మరుగుం’డని కఱపిన గురువృద్ధానుమతంబునం దమ తల్లి చరణంబులకు మ్రొక్కినం గొడుకుల.