Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.295

Āndhra Mahābhāratamu 3.1.295

Language
Telugu

3.1.295

వ. అట్లేని నిఖిల లోకపాల సహితుండై యీశ్వరుండు నీ యభిమతం బొనరించు’ నని సహస్రలోచనుండు లోచనాగోచరుం డైన, నర్జునుండును దద్వచనంబున సమాహితచిత్తుండై హిమశైలశిఖరంబున కరిగి వివిధ కుసుమ ఫల వృక్షంబులను విమల నిర్ఝర జలంబులను గమల కుముద కల్హార కలహంస సంకుల పంకజాకరంబులను రమ్యంబైన తపోవనంబునందుఁ బరమేశ్వరు నుద్దేశించి తపంబు సేయందొడంగిన.